Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మీర్జాపూర్ లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన 

మీర్జాపూర్ లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల పై శుక్రవారం హుస్నాబాద్ ఏఎస్ఐ మల్లేశం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సోషల్ మీడియా, మహిళల రక్షణకు ఉన్న చట్టాలి, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికుల పనిచేసే చోట వేధింపులు, గుడ్ టచ్ బాడ్ టచ్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు, సైబర్ నేరాలు సైబర్ బెదిరింపులు, మైనర్ డ్రైవింగ్, అపరిచిత వ్యక్తుల పట్ల ఉండవలసిన జాగ్రత్త చర్యలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించమన్నారు. ఏలాంటి సమస్యకైనా  100 లేదా సిద్దిపేట షీటీమ్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ వేణుకుమార్, హుస్నాబాద్ షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు ప్రశాంతి, స్వప్న, కానిస్టేబుల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad