Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంపై తల్లులకు పిల్లలకు అవగాహన 

పౌష్టికాహారంపై తల్లులకు పిల్లలకు అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
స్త్రీ శిశు సంక్షేమ శాఖ పోషణ మాసంలో భాగంగా బుధవారం మండలంలోని దుంపలగూడెం 1 అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు, పిల్లలకు ముర్రు పాలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించినట్లు అంగన్వాడీ టీచర్ దీప తెలిపారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి ముర్రుపాలు ఎంతో శ్రేష్టమైనవి అన్నారు. ముర్రుపాలతో పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.

వ్యతిరేక పరిస్థితులను తట్టుకునే విధంగా పిల్లలను తయారు చేస్తుందన్నారు. అదేవిధంగా ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నదని అన్నారు. రోజులు నెలలు సంవత్సరాలను బట్టి పిల్లలు ఎదుగుదలను సక్రమంగా వచ్చే విధంగా పౌష్టికాహారాన్ని పొందాలని సూచించారు. పౌష్టికాహారం వల్ల పిల్లలలో బరువు తగ్గుదల రక్తహీనత వంటి లక్షణాలను అధిగమించి సక్రమంగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సరిత ఆశ కార్యకర్త రాజేశ్వరి తో పాటు పలువురు తల్లులు, వారి పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -