- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా పాదచారులు, టూవీలర్ వాహనాలు నడిపేవారు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారన్నారు.విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయులు షబానా, సంజీవ్, సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



