Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూనియన్ బ్యాంక్ సేవలపై అవగాహన 

యూనియన్ బ్యాంక్ సేవలపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామంలో మంగళవారం యూనియన్ బ్యాంక్ శివన్నగూడ బ్రాంచ్ మేనేజర్ విజయ సింహారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్యాంక్ ఖాతా నెంబర్,ఏటీఎం పిన్ వివరాలను ఇతరులకు చెప్పకూడదని తెలిపారు.రైతులకు బ్యాంక్ ఇస్తున్న క్రాప్ లోన్ మరియు ప్రధాని జనజీవన పథకం ను సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను కూడా సకాలంలో చెల్లిస్తూ బ్యాంక్ అందించే బెనిఫిట్స్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొట్టాల గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య,బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రిషికేష్,అసిస్టెంట్ మేనేజర్ రిషిత,స్పెషల్ అసిస్టెంట్ నరేష్,విలేజ్ బుక్ కీపర్ గంట మంజుల,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -