Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా రక్షణ చట్టాలపై అవగాహన ..

మహిళా రక్షణ చట్టాలపై అవగాహన ..

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని మడత గ్రామంలో” ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న మహిళా కూలీలకు గురువారం హుస్నాబాద్ పోలీస్, షీ టీం ఆధ్వర్యంలో మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాట్సప్ కు వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని, ఎవరైనా బ్యాంకు అధికారులని మాట్లాడితే బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ఎవరికీ తెలుపవద్దని సూచించారు. అనుకోకుండా ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 ఫిర్యాదు చెయ్యాలన్నారు. మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే, అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏఎస్ఐ మణెమ్మ, ,షీటీమ్ బృందం హెడ్ కానిస్టేబుల్ సదయ్య, మహిళ కానిస్టేబుళ్లు ప్రశాంతి, స్వప్న,  కృష్ణ, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -