ప్రతి మహిళ ఉన్నత స్థాయికి ఎదగాలి
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సి సి శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
మహిళా సంఘాల సభ్యులు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని బ్రాహ్మణ కొత్తపళ్లి గ్రామ సి సి శ్రీనివాస్ కోరినట్లు తెలిపారు. గురువారం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ఎంపీ రికవరీ పై అవగాహన కల్పిస్తూ రికవరీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వారి కుటుంబాలు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా లక్షలాది రూపాయలను గ్రూపులకు ఇస్తుందని అన్నారు.
మహిళా సంఘం సభ్యురాలు ప్రతి నెల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి లోన్లను సకాలంలో చెల్లించి వడ్డీ లేని రుణాలను తీసుకొని మహిళలు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలోని జననీ సంఘం, మదర్ తెరిసా సంఘం, భాగ్య లక్ష్మీ సంఘం, రాజమాత సంఘాల,కు రికవరీ చేస్తూ అవగాహన కల్పించినట్లు తెలిపారు. సంఘం సభ్యురాలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చిన్నచిన్న పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్క సభ్యురాలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని అభివృద్ధి వైపు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ వివో ఏలు చింతకుంట్ల ఉపేందర్, అక్కర ఉషారాణి మహిళా సంఘం సభ్యురాలు పాల్గొన్నారు.



