నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని చలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం అనుముల ప్రాజెక్టు చల కుర్తి సెక్టార్ సూపర్ వైజర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, మహిళలపై హింస, లింగ వివక్షపై శనివారం గ్రామం లోని అంగన్వాడీ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. భేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ పై అంగన్వాడీ టీచర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పింస్తున్నారని తెలిపారు.
ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని తెలిపారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 18 ఏళ్ళు నిండిన
తరువాతే ఆడపిల్లలకు వివాహాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఝాన్ని, ఉపాధ్యాయులు పద్మ, ప్రమీల, శోభారాణి, సైదా నాయక్, నాగరాజు, వెంకటరమణ, పద్మ, ప్రమీల, శ్రీదేవి, శంకర్ నాయక్ అంగన్వాడీ టీచర్లు శాంతమ్మ, యాదమ్మ, మంగమ్మ పాల్గొన్నారు.



