నవతెలంగాణ – వనపర్తి
సీపీఆర్ అవగాహన వారోత్సవం (13–17 అక్టోబర్ 2025) సందర్భంగా వనపర్తి టీఎస్ ఆర్టీసీ డిపోలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం సీపీఆర్ విధానంపై ఆర్టీసీ కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఆర్ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ మంజుల పాల్గొని, హృదయ ఆపద సమయంలో తీసుకోవలసిన అత్యవసర చర్యలపై వివరంగా అవగాహన కల్పించారు. సీపీఆర్ (Cardio Pulmonary Resuscitation) పద్ధతి గురించి ప్రాక్టికల్ శిక్షణను అందించారు. ప్రాణరక్షణలో ప్రతి ఒక్కరూ సీపీఆర్ పద్ధతిని నేర్చుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగలరని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆర్టీసీ సిబ్బందికి ప్రాణరక్షక నైపుణ్యాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారిలో ప్రజా సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ సి డి బృంద సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్, టీజీ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
వనపర్తి ఆర్టీసీ డిపోలో సీపీఆర్ పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES