Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాన

కొయ్యుర్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ రైతువేదికలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై తగిన మోతాదుల ఎరువుల వాడకం, భూసార పరీక్షలపై ఏఈఓ అనూష అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున సలహాలు సూచనలు, సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం సర్పంచ్ కొండ రాజమ్మ చేతులమీదుగా రైతులకు క్యాలెండర్, టోపీలు ,పెన్స్, బుక్స్, గోనె సంచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రారo ఏఈఓ సంధ్య రాణి, వల్లంకుంట గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత, ఉప సర్పంచ్ లాకవత్ సవెంధర్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -