- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మచ్చాపూర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో ధనలక్ష్మి టీచర్ ఆధ్వర్యంలో చిన్నారులు మహిళలు, గర్భిణీ స్త్రీలకు మంగళవారం పోషకాహారం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోషకాహారం పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్న విషయాన్ని గుర్తు చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది అయినా జెండర్ స్పెషలిస్టులు స్రవంతి ,స్వప్న మరియు మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -