Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లక్కోరాలో ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన

లక్కోరాలో ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్  
మండలంలోని  లక్కోరా గ్రామంలో  ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని శృతి మాట్లాడుతూ .. ఆయిల్పామ్  పంట సాగు ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ వివరాలను, అదేవిధంగా పంట సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి క్లుప్తంగా రైతులకు తెలియజేయడం జరిగింది. ఒక ఎకరానికి సరిపడా 50 మొక్కలు కేవలం వెయ్యి రూపాయలకే అందజేస్తుందని దీనితో పాటు ఎస్సీ ,ఎస్టీ రైతులకు 100% సబ్సిడీపై, ఇతర రైతులకు 90% రాయితీపై డ్రిప్ అందజేస్తుందని తెలిపారు.

అంతేకాకుండా సంవత్సరానికి రూ.4200 పంట సంరక్షణ కోసం అందజేస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడితో కూడి అధిక లాభాలను  ఇచ్చే పంట. మరియు మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటగా వరి కాకుండా  సోయాబీన్ , మొక్కజొన్న ,జొన్న ,ఇతర పంటలు ఏవైనా సాగు చేసుకోవచ్చని,3 సంవత్సరాల తరువాత నుండి ఎకరానికి సంవత్సరానికి 3 టన్నుల చొప్పున దిగుబడి మొదలవుతుందని,4 సంవత్సరాలకి 6టన్నులు,10 సంవత్సరాల వరకు ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి రావడం జరిగిందని అన్నారు.

అంతే కాకుండ వరీ,మొక్కజొన్న,సోయాబీన్ పంటల్లో ఎరువుల యాజమాన్యం,ప్రస్తుతo చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యల గురించి రైతులకి వివరించడం జరిగింది. ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధి తరుణ్ మాట్లాడుతూ.. కంపెనీ మొక్కల సరఫరా చేయడం మొదలుకుని పంట కోసి కలెక్షన్ సెంటర్ కి పంపే వరకు పూర్తిగా తమ సహకారం ఉంటుందని ఆసక్తి గల రైతులు తమ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది.

అంతే కాకుండ ఇప్పటికే గ్రామంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు అనుభవాలను మిగతా రైతులతో పంచుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారిని తిరుమల,గ్రామ పంచాయతీ  కార్యదర్శి విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బాల్కొండ కాన్స్టెన్సీ ఆత్మరామ్, మాల మహానాడు ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు గంగ మోహన్  రైతులు  పెద్దోళ్ల హన్మండ్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad