Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సమాచార హక్కుపై అవగాహన

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సమాచార హక్కుపై అవగాహన

- Advertisement -

– సమాచార హక్కు చట్టం – 2005  కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచార హక్కు చట్టం – 2005 పై ఆస్పత్రి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ పి. వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం – 2005 కు సంబంధించిన అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాచార హక్కు చట్టం – 2005 ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పీల్ అధికారుల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

అవసరమైన సమాచారం కోసం ప్రజలు సంబంధిత ఆసుపత్రుల్లో దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా సమాచారం అందజేస్తామని వివరించారు. సమాచార హక్కు చట్టం అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం, ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ యాదగిరి, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జోనల్ అధ్యక్షుడు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి యు. భాగ్యలక్ష్మి, జిల్లా ప్రతినిధులు బట్టు శ్రీనివాస్, ఎం. సుధాకర్, రామచందర్, ఎం.వి. భాస్కర్, సల్ల కృష్ణ, అన్వర్ గోరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -