- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు భిక్నూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు ఇర్షాద్ అలీ, కృష్ణ తేజ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



