– ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆట వస్తువుల పంపిణీ
– ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కలెక్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – కామారెడ్డి
Arrive Alive ప్రోగ్రామ్‌లో భాగంగా శుక్రవారం జనగామ మండలం బిబిపేట్ గ్రామంలో ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, సైబర్ క్రైమ్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత మొబైల్ ఫోన్లు, మత్తుపదార్థాలకు బానిస కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ యువజన సంఘాలకు ఆట వస్తువులైన క్యారం బోర్డులు, చెస్ బోర్డులను బహూకరించారు.అనంతరం ఎస్.సి, ఎస్.టి ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాత స్వామి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, బిబిపేట ఎస్సై విజయ్, ఏఎస్ఐ, వార్డ్ మెంబర్లు నరసింహ చారి, బెల్ల వంశీ, అందే భూదేవి, రేణుక, కుమ్మరి శ్యామల, బేలె రాజబాబు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాత బాబు, తదితరులు పాల్గొన్నారు.


