విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని  ఐసిడిఎస్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర బాలికలకు  బాలికల పర్సన్ హైజి, శారీరక, మానసిక ఎదుగుదలపై సమాజంలో ఒక స్త్రీ ఎలా మెలగాలి అని నైపుణ్యం గురించి అంగన్వాడి టీచర్లు క్షుణంగా వివరించారు. ఆడపిల్ల చదువు ప్రాముఖ్యత, బేటి పడావో – బేటి బచావో  కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్యానికి కావలసిన అలవాట్లు, సమతుల ఆహారం, శరీరానికి విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు వల్ల ఉపయోగాలు తదితర వాటిని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా మండలంలోని చౌట్ పల్లి, బషీరాబాద్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అంగన్వాడి టీచర్లు  విద్యార్థినిలకు  బేటి బచావో- బేటి పడావో పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, భీంగల్ ప్రాజెక్టు ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు సరస్వతి, అంగన్వాడి టీచర్లు  ఉప్లూర్ లో పద్మ, సరిత, శోభ, ఆశ కార్యకర్తలు రాధా వినీల, శాంత, ఉపాధ్యాయినీలు గోదావరి, మాధురి, శ్రావణి, చౌట్ పల్లిలో సునంద, ప్రేమలత, ప్రణమేశ్వరి, లక్ష్మి, బషీరాబాద్ లో మంజుల, సువర్ణ, అరుణమల, పద్మ, ప్రణవ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love