Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగు, ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

ఆయిల్ ఫామ్ సాగు, ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని  రాంనగర్ గ్రామంలో శుక్రవారం ఆయిల్ ఫామ్ సాగు ప్రాముఖ్యత గురించి రైతాంగానికి జిల్లా ఉద్యాన అధికారి శ్రీ దండు సంజీవరావు వివరించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ భారతదేశంలో వంటనూనెల ఉత్పత్తి 16.69 మిలియన్ మెట్రిక్ టన్నుల కాగా 33.20 మిలియన్ మెట్రిక్ టన్నుల  వినియోగం  జరుగుతున్నది. సంవత్సరానికి భారతదేశంలో పామ్ ఆయిల్ 259 లక్షల టన్నులు వినియోగానికి అవసరం కాగా 100 లక్షల మెట్రిక్ టన్నులు   ఉత్పత్తి అవుతుంది.కావున 67% పామాయిల్ ఇతర దేశంలో నుండి దిగుమతి సుంకం చెల్లించి తీసుకుంటున్నాము.  మనదేశంలో 13.24 లక్షల ఎకరాల్లో సాగు ఉండగా ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు  కావాలని వంటనూనెల దిగుమతి భారాన్ని తగ్గించడానికి భారత్ ఆయిల్ ఫామ్ మిషన్ పథకాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుంది. జె. శ్రీకాంత్ ఉద్యాన అధికారి ములుగు డివిజన్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ మొక్కలపై 90% రాయితీ అనగా ఎకరానికి రూ.11600/- మరియు 4 సంవత్సరాల వరకు అంతర పంటలు యాజమాన్యం కోసం రూ.16800/- డ్రిప్ పరికరాల కోసం రూ. 22,518 మొత్తంగా రూ.50918/-  రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా అందిస్తుంది. ఆయిల్ ఫామ్ పంట కాకుండా సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి పథకంలో మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, మల్చింగ్, పథకాలు అమల్లో ఉండగా మైక్రో ఇరిగేషన్ పథకంలో డ్రిప్, స్ప్రింక్లర్ కూడా రైతులకు అందించడం జరుగుతుంది.

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా సౌర విద్యుత్తు మోటార్లు, డ్రిప్ తో పాటు ఆయిల్ ఫామ్ మొక్కలు 100%  రాయితీపై పట్టా కలిగిన పోడు భూములను కలిగిన గిరిజన రైతులకు ఐటిడిఏ, ఏటునాగారం ద్వారా మంజూరు కావడం జరుగుతుంది. కావున ఆసక్తిగల రైతులు దరఖాస్తులను సమీప పెసా కోఆర్డినేటర్స్, మండలంలోని ఆయిల్ ఫామ్ ప్రతినిధి లేదా సమీప ఉద్యాన అధికారులు సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో హర్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్, కే ఎన్ బయో సైన్స్ మండల ప్రతినిధి సురేష్, నవీన్ నాయక్, ,రైతులు సోనియా నాయక్, భూక్య మోహన్, సీతారాం, సమ్మయ్య, సారక్క, రజిత, శారద, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -