Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సౌత్ క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం

సౌత్ క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం

- Advertisement -

విద్యార్థులకు ఏఎస్పీ చైతన్య రెడ్డి సూచనలు
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం పోలీసుల అధ్వర్యంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి నిర్వహించారు. ఇటీవలి కాలంలో క్యాంపస్‌లో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, ర్యాగింగ్ ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్యాంపస్‌లో విద్యార్థులు కలిసిమెలిసి ఉండాలని, ఒకరి పై ఒకరు పెత్తనం చలాయించడం మానుకొని విద్యాభ్యాసంలో కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

ఇతర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ర్యాగింగ్, గొడవలకు పాల్పడటం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ సుధాకర్, క్యాంపస్ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.   విద్యార్థుల దారి తప్పడానికి ప్రొఫెసర్లు కారణం…క్యాంపస్‌లో విద్యార్థుల ర్యాగింగ్, గొడవలకు అధ్యాపకుల పర్యవేక్షణ లోపం కూడా ఒక కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్లు విద్యార్థులపై సరైన పర్యవేక్షణ ఉంచి, వారు ఎలా చదువుతున్నారు. ఏమి చేస్తున్నారన్న విషయాలను గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ల విద్యాబోధనపై పర్యవేక్షణ నిర్వహించి క్యాంపస్‌ను సరైన దారిలో నడిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -