నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్, పడగల్ గ్రామాలలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర జొన్న సాగు-విత్తన ఒప్పందంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు పాల్గొని రైతులకు ఎర్ర జొన్న సాగు-విత్తన ఒప్పందంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర జొన్న సాగు విత్తన ఒప్పందంపై రైతులు సంబంధిత సంస్థ ద్వారా అగ్రిమెంట్ లీగల్ గా బాండ్ పేపర్ పై తీసుకోవాలని రైతులకు తెలిపారు. రైతులు పంట దిగుబడి తర్వాత నష్టపోకుండా పండించిన పంటకు సరియైన ధర, లాభం చేకూరేలా ఒప్పందం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయిల్ ఫామ్ కల్టివేషన్, సేంద్రీయ వ్యవసాయం, వివిధ పంటల సాగు సమస్యలపై రైతులకు సలహాలు సూచనలు చేశారు. హార్టికల్చర్ అధికారి రాజు ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీలు రైతులకు వివరించారు. పసుపు సాగు సమస్యలపై రైతులతో చర్చించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయిరాం రాజ్, ప్రశాంత్, రెండు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఎర్ర జొన్న సాగు-విత్తన ఒప్పందంపై అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



