నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య మాట్లాడుతూ.. జీవనశైలి మార్పుల వల్ల క్యాన్సర్ ముప్పు మానవాళికి పెను ప్రమాదంగా మారుతోందని అందుకే ఆరోగ్యకరమైన జీవనం, పోషకాహారం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలను ప్యాకింగ్ చేయడం, వాడటం నివారిస్తే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
పొగాకు, ధూమపానం, ఖైని, గుట్కా వంటివి వాడటం వల్ల గొంతు క్యాన్సర్లు పెరుగుతున్నాయని, వీటిని పూర్తిగా మానాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏ సబ్ సెంటర్‌లో శ్యామల, బి సబ్ సెంటర్‌లో మంజుల, మాధవి,యాదమ్మ, హేమలత, స్వరూప,పూజ, స్వరూప, ప్రశాంత్, యశోదతో, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు సువర్ణ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.


