నవతెలంగాణ – కంఠేశ్వర్
సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతను విద్యార్దుల్లో కలిగించే దిశగా ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యంలో పర్మినెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సేవే మార్గం – అవగాహనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు సాయిబాబా తెలిపారు. కెమెరాకు మంగళవారం స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులకు సేవా కార్యక్రమాలు – సామాజిక బాధ్యత కలిగించేలా అవగాహన కల్పించటం జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు.
విద్యార్థులకు ఇప్పటినుండే సామాజిక బాధ్యత, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించటం ద్వారా వారంతా మంచి మార్గం వైపుగా నడిచేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. సర్విస్ ఫిల్డ్ వర్కు లో విద్యార్థులు నేరూగా పాల్గోంటు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయాన్ని వారు చేసే కార్యక్రమాలు చూడటం జరిగిందన్నారు ….. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టు అనేది జిల్లాలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా మెదలు పెట్టడం జరీగిందన్నారు. అనాధలు అభాగ్యులు నిరాశ్రయుల విధివంచితులు రోడ్లపై ఎలాంటి అవస్థలు పడుతున్నారు వృద్దాప్యంలో వచ్చే ఇబ్బందులు కుటుంబాలకు దూరమైన విదివంచితుల దుస్థితి విద్యార్థులకు విడియె ప్రెజెంటేషన్ ద్వారా తెలపటం జరిగింది తల్లిదండ్రులు, సమాజం,పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలో వివరించటం జరిగింది ఈ ప్రాజెక్టు నిరంతరం కోనసాగుతుందని తెలిపారు.