- Advertisement -
- – మహిళ అభ్యున్నతి పై సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల - సంకల్ప అవగాహన కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో మహిళల అభ్యున్నతి పై సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహణ పై ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు 10 రోజుల పాటు సంకల్ప్ హెచ్.ఈ.డబ్ల్యూ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్, మహిళల సంరక్షణ కోసం ఉన్న చట్టాల పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
- మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి , అందుతున్న వివిధ ఉపాధి అవకాశాలపై 500 మంది మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్ల కు సంపూర్ణ అవగాహన కల్పించి ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాలని ఉచితంగా ప్రచారం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పాఠశాలలు డిగ్రీ, నర్సింగ్, మెడికల్, అగ్రికల్చర్ కళాశాలలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థల్లో జెండర్ సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కిషోర్ స్వస్థ క్షేత్రం సందర్శించాలని, సానిటరీ పాడ్ వినియోగం , వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పై అవగాహన కల్పించాలని అన్నారు.
- పనిచేసే ప్రదేశాల్లో మహిళల సేఫ్టీ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని, షీ టీమ్స్ బృందాల గురించి చర్చించాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో మహిళల వేధింపుల గురించి చర్చించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ క్లినిక్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఉన్నత చదువులు, నైపుణ్య శిక్షణ పొందుతున్న మహిళలతో సెల్ఫీ తీసుకుంటూ సామాజిక సమాజంలో మహిళ అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని అన్నారు.
- బాలికలలో అనేమియా నిర్మూలన, మహిళలలో క్యాన్సర్ త్వరగా గుర్తింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాలలు కళాశాలలో కమ్యూనిటీ ప్లేసెస్ లో అవగాహన కార్యక్రమాలు జరపాలని అన్నారు. పోస్కో యాక్ట్ గురించి అందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, డి.ఆర్.డి.ఓ శేషాద్రి డిఈఓ వినోద్ కుమార్ డిపిఓ షరీఫుద్దీన్ డిఎం & హెచ్ ఓ డాక్టర్ రజిత, సఖి సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -