నవతెలంగాణ – భువనగిరి : ఒక్కరూ “ఒక్క బిడ్డ ముద్దు – మరొక బిడ్డకు హద్దు” అనే నినాదంతో జనాభా నియంత్రణపై కృషి చేయాలని ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో, భువనగిరి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం దాదాపు 150 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ పెరుగుతున్న జనాభా వనరుల కొరత, విద్య, ఉపాధి, గృహ సమస్యలు మరియు ప్రకృతి పునాది మార్పులను కలిగించే ప్రమాదం ఉందన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. ఉందన్నార మాట్లాడుతూ .. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ అంశంలో ముఖ్య పాత్ర పోషించాలని, జనాభా పెరుగుదల వల్ల కలిగే ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఒక్క సంతానంతో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్పేసింగ్ మెథడ్స్ (అంతరకాల పద్ధతులు) గురించి అవగాహన కల్పించి ప్రజలకు మోటివేషన్ ఇవ్వాలన్నారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సూచన మేరకు జులై 11న ప్రపంచ జనాభా పెరుగుదల దాని ప్రభావాలు కుటుంబ నియంత్రణ అవసరాలపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.ఈ ర్యాలీలో సిజిహెచ్ సూపర్నెంట్ డాక్టర్ పాండు ప్రోగ్రామ్ ఇన్చార్జ్ డాక్టర్ యశోద, డాక్టర్ సాయి శోభ, డాక్టర్ శిల్పిని, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఆశా వర్కర్లు హెల్త్ వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES