- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారయణ గౌడ్ అధ్వర్యంలో మత్తు పదార్థాలు, గంజాయి నివారణపై బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లు కి డ్రగ్స్ నియంత్రణ, గంజాయి, మద్యపానం తదితర అలవాట్లుకి దూరంగా ఉండాలని కోరారు. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయిలో లక్ష్యాలను ఏర్పరచుకొని, దేశ శ్రేయస్సుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, సామాజిక సేవకులు పట్వారి తులసి, లక్ష్మణ్,స్వామి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -