Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్7న సిర్పూర్ లో రైతులకు అవగాహన సదస్సు

7న సిర్పూర్ లో రైతులకు అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : బుధవారం సిర్పూర్ గ్రామంలో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన క్షేత్ర శాస్త్రవేత్తలతో సమావేశం ఉంటుంది. కావున సకాలంలో రైతులందరూ హాజరు కావాలని ఒక ప్రకటనలో ఏవో సౌమ్య, ఏఈఓ రంజిత్ తెలిపారు. అలాగే వ్యవసాయం ఉన్నతాధికారులు తెలియజేస్తూ  వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలో రైతులకు 11 అంకెల గల ఫార్మర్ ఐడిని అందజేయనున్నారు. ఇందుకోసం సోమవారం నుండి ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనికోసం రైతులు తమ ఆధార్, పట్టా పాస్ పుస్తకం ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ తీసుకొని వ్యవసాయ విస్తారణ అధికారులును సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతి రైతుకు 11 నంబర్లతో  విశిష్ట సంఖ్య (యూనికోడ్) ఫార్మర్ ఐడి ని అందజేయనున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో ఏ రకమైన చట్టబద్ధత యాజమాన్య హక్కును కల్పించబోదని, ఇది కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాల ప్రామాణికంగా తీసుకొని రైతులకు ఫార్మర్ ఐడీ ని కేటాయించించబడుతుందని వారు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మార్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయనున్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్  రిజిస్ట్రేషన్ లో నమోదు  తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉత్తర్వులను జారీ చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా రుణమాఫీ తదితర పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఎటువంటి సంబంధం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. కావున రైతులందరూ సహకరించాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad