Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన సదస్సు

బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ మండల పరిధిలోని ఎరువుల దుకాణాల వద్ద  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి, ఏడీఏ ఇన్‌చార్జి  మాట్లాడుతూ, రైతులు యూరియాను సులభంగా, త్వరితగతిన పొందేందుకు ప్రభుత్వం ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియా ఎక్కడ అందుబాటులో ఉందో రైతులు తెలుసుకొని, యాప్‌లోనే బుకింగ్ చేసుకుని, సంబంధిత షాప్ వద్ద ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్‌తో హాజరై సులభంగా యూరియాను పొందవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, యూరియా బ్లాక్ మార్కెట్‌కు అవకాశమే ఉండదని అన్నారు. యాప్ వినియోగంపై ఎలాంటి సందేహాలున్న రైతులు తమకు సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. అదే విధంగా ఎరువుల డీలర్లు ఈ-పాస్ ఆధారంగా యూరియా విక్రయించాలని, రోజువారీ రికార్డులను అప్డేట్ చేస్తూ ఉండాలని, లేనిపక్షంలో శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -