నవతెలంగాణ – ఆర్మూర్: ఆలూర్ మండలం లో రెవెన్యూ శాఖ , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులుకు, డ్రైవర్లకు వరి కొతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రాంబాబు మాట్లాడుతూ.. రైతులు వరి చేను పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోత ప్రారంభించాలన్నారు. హార్వెస్టర్ మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి అని అలాగే మిషన్ ఆర్‌పీఎం 19–20 కంటే తక్కువగా ఉండకూడదని సూచించారు.
అదేవిధంగా గేరు స్నోట్‌ను ఏటు నుంచి బివన్ లో ఉంచి కొత కొనసాగించాలని సూచించారు.రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మంచి ధరలు పొందే అవకాశం ఉంటుందని, అజాగ్రత్త వలన ధాన్యం నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, వ్యవసాయ అధికారి రాంబాబు, సీఈఓ మల్లేష్, రెవెన్యూ , వ్యవసాయ శాఖ సిబ్బంది, హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.