Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు 

ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ” స్వచ్ఛ విద్యాలయ్ హరిత విద్యాలయ్” అనే అంశంపై సోమవారం రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. మండల విద్యాధికారి డి, స్వామి మాట్లాడుతూ… ప్రతి పాఠశాల స్వచ్ఛ పాఠశాలగా ఉండాలని, ప్రతి పాఠశాలలో ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటి హరిత విద్యాలయంగా మార్చాలని అన్నారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ పైనకూడా అవగాహన కల్పించి వారిని విద్యావంతులుగా, బుద్ధిమంతులుగా చేయాలని మండల విద్యాధికారి స్వామి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇమాన్యుయల్, శేఖర్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -