Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రంలో భేటీ బచావో, భేటీ పడావో పై అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో భేటీ బచావో, భేటీ పడావో పై అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని తెప్పలమడుగు అంగన్వాడీ కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై మంగళవారం అనుముల మండలం ఐసీడీఎస్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏసీడీపీఓ సువర్ణ ఆధ్వర్యంలోబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, మహిళలపై హింస, లింగ వివక్షపై గ్రామం లోని అంగన్వాడీ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సువర్ణ మాట్లాడుతూ.. భేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ పై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజార్ శశికళ ,అంగన్వాడీ లబ్ధిదారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -