నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక పద్ధతుల ద్వారా వీడియో విజువల్ ప్రొజెక్టర్ ద్వారా కపాస్ కిసాన్ యాప్ పై గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ ఈ ఓ గణేష్ మాట్లాడుతూ.. ప్రతి రైతు కపాస్ కిసాన్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులు స్లాట్ బుక్ చేసుకునే విధానం పై అవగాహన పెంచుకోవాలని కిసాన్ యాప్ వాడకంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించవలసిందిగా కోరారు. ప్రతి రైతు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12 %తేమ ఉండేలా పత్తిని ఆరబెట్టుకొని CCI( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకొని వెళ్లి ప్రభుత్వము మద్దతు ధర రూ . 8110 పొందాలని కోరారు.
కపాస్ కిసాన్ యాప్ పై పెద్దాపూర్ లో అవగాహన సదస్సు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



