నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్. సి.వి రామన్ టాలెంట్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం, ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం నల్సా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కరస్పాండెంట్ డాక్టర్ మురళీధర్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, స్కూల్ అడ్వైజర్ సత్తార్, ప్రిన్సిపల్ షబానా విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES