నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూరు మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి రాంబాబులు గురువారం అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. సేంద్రియ వ్యవసాయంలో చీడపీడల కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సేంద్రియ ఎరువులను వాడవలసిందిగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూసార పరీక్ష ఫలితాల కార్డులను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్లెం మల్లారెడ్డి ఏఈఓ వసుధం, ప్రకృతి వ్యవసాయం సిఆర్పి కొత్తూరు సుజాత, గంగాధర్, ములకడి శ్రీనివాస్ రెడ్డి, నడిసారం మల్లయ్య, తిరుమలపల్లి నవనీత్, పెండ ఉదయ్ రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -



