నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్/ బీబీనగర్
ఆయిల్ ఫామ్ పంట సాగు, బిందు సేద్యం ద్వారా ఎరువుల సరఫరా గురించి అన్నంపట్ల గ్రామం బీబీనగర్ మండలంలోని ప్రణీత వెంకట్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పంట కోతలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ పంట సాగు, తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, ప్రతి మొక్కకు అందించవలసిన నీరు, ఎరువులను గురించి, ఆయిల్ పామ్ పంట లో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్దతుల గురించి జిల్లా ఉద్యాన అధికారి ఎం మాధవి వివరించారు. విక్రయ అనంతరం చేపట్టే బిందు సేద్య సేవలలో భాగంగా వెంచూరి ద్వారా ఎరువులను పంపించడం, యాసిడ్ ట్రీట్మెంట్ చేయు విధానంను గ్లోబల్ మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఉద్యాన అధికారి కె స్రవంతి, ఉద్యాన అధికారి టెక్నికల్ జి స్నేహిత, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీమతి స్వర్ణలత, ఏ ఈ ఓ ఉమామహేశ్వరి, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ గణేష్,హెచ్ ఈ ఓ శ్రీనివాస్, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీమతి శిరీష , మౌనిక, హరీష్, రైతులు పాల్గొన్నారు.



