Saturday, May 17, 2025
Homeజిల్లాలుఉల్లాస్ పథకంపై అవగాహన పెంచుకోవాలని

ఉల్లాస్ పథకంపై అవగాహన పెంచుకోవాలని

- Advertisement -

-ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు సక్రు నాయక్
– వయోజనులకు అక్షరాస్యత కోసం అవగాహన కార్యక్రమం 
– కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఉల్లాస్ కమిటీ ఏర్పాటు

నవతెలంగాణ -తాడ్వాయి  : ఉల్లాస్ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సక్రు నాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ ప్రముఖులు, పేరెంట్స్ తో( ఉల్లాస్) వయోజనులకు అక్షరాస్యత కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాశులను అక్షరాసులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నారు. ప్రాథమిక అక్షరాస్యత ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ అక్షరాస్యత ఆరోగ్య సంరక్షణ అవగాహన కుటుంబ సంక్షేమంతో పాటు తదితర జీవన నైపుణ్యాలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిడమే ఉల్లాస్ పథకం లక్ష్యమన్నారు. గ్రామంలో‌ చదువుకోని వారిని గుర్తించి పది రోజు రాత్రి వారికి రెండు గంటల పాటు బోధించాలని సూచించారు. అనంతరం నిరీక్ష రాశులను గుర్తించు కంపెనీ ఏర్పాటు చేశారు. కాటాపూర్ ఉల్లాస్ కమిటీ కన్వీనర్ బాణాల సుధాకర్, కో కన్వీనర్ రోజా రాణి లతో పాటు, పదిమంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులి నరసయ్య గౌడ్, మాజీ ఎంపిటిసి దానకర్ నరసింహారవు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సర్ఫ్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -