నవతెలంగాణ – ఆసిఫాబాద్ : మహిళా రక్షణ చట్టాలపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని ఆసిఫాబాద్ షీ టీం సభ్యురాలు స్వప్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో భాగంగా మహిళ రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూనే రక్షించుకోవడం ఎలాగో నేర్పాలన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకుండా వారిని ఎప్పటికప్పుడు నిరోధించేలా ప్రయత్నాలు చేయాలన్నారు. మహిళలు బాలికల రక్షణ కోసం ఫోక్సో లాంటి చట్టాలు ఉన్నాయన్నారు. పాఠశాలల్లో ప్రత్యేక కమిటీలు వేసి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల పట్ల సమాజంలో ఎవరైనా లేదా సహా ఉపాధ్యాయులు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే షీ టీం గాని, ఐసి టీంని కానీ సంప్రదించాలన్నారు. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ షీటీమ్ నెంబర్ 8712670564 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ షీటీమ్ బృందం మహిళ కానిస్టేబుల్స్, రజిని, స్వప్న, కానిస్టేబుల్ దినేష్, హెడ్ మాస్టర్ శ్రీలత పాల్గొన్నారు.
మహిళా రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES