- Advertisement -
హైదరాబాద్ : ప్రయివేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారులకు సేవలను మరింత మెరుగుపర్చడానికి ‘స్పర్శ్ వీక్ 2025’ను ప్రారంభించినట్టు సోమవారం తెలిపింది. సెప్టెంబర్ 1-5 వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 5,868 శాఖలలో ఒక్క లక్షకు పైగా ఉద్యోగులు కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతారని పేర్కొంది. 40 నగరాల్లో తమ సీనియర్ అధికారులు ఖాతాదారులతో సమావేశమై సేవల నాణ్యతను మెరుగుపర్చడానికి కృషి చేస్తారని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి తెలిపారు.
- Advertisement -