– పెరిగిన మొండి బాకీలు
ముంబయి : ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 3.8 శాతం పతనంతో రూ.5,806 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,034.64 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.13,448 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ).. గడిచిన క్యూ1లో 0.8 శాతం పెరిగి రూ.13,560 కోట్లుగా చోటు చేసుకుంది. గడిచిన జూన్ ముగింపు నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.11.62 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.54 శాతం నుంచి 1.57 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు కూడా 0.34 శాతం నుంచి 0.45 శాతానికి ఎగిశాయి. గడిచిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.2,778 కోట్ల మొండి బాకీలను రద్దు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలోనూ రూ.904 కోట్ల అప్పులను రద్దు చేసింది.
యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో తగ్గుదల
- Advertisement -
- Advertisement -