నవతెలంగాణ హైదరాబాద్ : భారతదేశపు అగ్రశ్రేణి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) ఒకటైన యాక్సిస్ ఫైనాన్స్, అక్షయ తృతీయ సందర్భంగా తమ యాక్సిస్ ఫైనాన్స్ దిశ హోమ్ లోన్స్‌ను ఆవిష్కరించింది. ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) మరియు అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) గృహ కొనుగోలు ఆకాంక్షలను తీర్చే విధంగా ఇది రూపొందించబడింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ, ప్రక్రియను వేగవంతం చేసే విధమైన సిస్టమ్‌ల దన్నుతో భౌగోళికంగా వివిధ ప్రాంతాలవ్యాప్తంగా రుణప్రక్రియ యావత్తూ నిరాటంకంగా సాగేలా దిశ హోమ్ లోన్స్ రూపొందించబడ్డాయి.శాలరీడ్ (రెసిడెంట్ &ఎన్నారై), స్వయం ఉపాధి పొందుతున్న వారు, ఇలా వివిధ వర్గాలకు అనువైన విధంగా ఇది తీర్చిదిద్దబడింది. సంఘటిత, సెమీ-సంఘటిత లేదా అసంఘటిత ఆదాయ పత్రాలు ఉన్న వారు, ఆర్థిక సహాయం కోసం అన్వేషిస్తున్న వారి అవసరాలను ఇది తీరుస్తుంది. సిద్ధంగా ఉన్న/నిర్మాణ దశలో ఉన్న/రీసేల్ ప్రాపర్టీల కొనుగోలుకు, ప్లాట్ + నిర్మాణం, స్వయంగా నిర్మించుకోవడం. హోమ్ రెనోవేషన్ / ఎక్స్‌టెన్షన్ ఇలా వివిధ అవసరాల కోసం ఈ రుణాన్ని పొందవచ్చు.“అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ‘యాక్సిస్ ఫైనాన్స్ దిశ హోమ్ లోన్స్‌ను ఆవిష్కరించడమనేది గృహ కొనుగోలు ప్రక్రియను మరింత అందుబాటులోకి తేవాలనే మా లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గృహాన్ని కొనుగోలు చేయాలన్న ఆర్థికంగా బలహీన వర్గాల ఆకాంక్షలకు, వాటిని సాకారం చేసుకోవడానికి మధ్య ఉండే ఆర్థిక అంతరాలను భర్తీ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ సెగ్మెంట్లో హౌసింగ్ ఫైనాన్స్‌ను మరింత అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ కృషికి అనుగుణంగా ఇది ఉంటుంది. వివిధ భౌగోళిక ప్రాంతాలవ్యాప్తంగా కస్టమర్ల వైవిధ్య అవసరాలకు అనుగుణంగా, అనుకూలీకరించిన విస్తృతమైన సొల్యూషన్స్‌ను దిశ హోమ్ లోన్స్ అందిస్తాయి” అని యాక్సిస్ ఫైనాన్స్ ఎండీ & సీఈవో సాయి గిరిధర్ తెలిపారు.
“అత్యుత్తమ సేవలు, పారదర్శకతతో పాటు మా కస్టమర్లకు మరింత మెరుగైన సొల్యూషన్స్‌ను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలోకి ప్రవేశించే కొద్దీ టెక్నాలజీ మరియు డేటా సైన్స్ మా కార్యకలాపాలకు వెన్నెముకగా నిలవనుంది. నిరాటంకమైన అనుభూతితో హౌసింగ్ ఫైనాన్స్‌ను సులభతరంగా అందుబాటులోకి తేవడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం” అని వివరించారు.
పటిష్టమైన సిస్టంలు, ప్రక్రియలు, సాంకేతిక, టాలెంట్, అండర్‌రైటింగ్ సామర్థ్యాలు, పంపిణీవ్యవస్థ దన్నుతో సురక్షితమైన మార్టిగేజ్ ఉత్పత్తులను అందించడంలో యాక్సిస్ ఫైనాన్స్‌కి సుదీర్ఘమైన, విజయవంతమైన చరిత్ర ఉంది.