ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 529/4 డిక్లేర్డ్
నవతెలంగాణ-హైదరాబాద్
ఢిల్లీ యువ క్రికెటర్లు ఆయుశ్ సుమిత్ దోసేజా (209, 279 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్స్‌లు), సంనత్ సంగ్వాన్ (211 నాటౌట్, 470 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) ద్వి శతకాలతో చెలరేగారు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 529 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అర్పిత్ రానా (7), యశ్ ధుల్ (0) వికెట్లతో 24/2తో ఒత్తిడిలో పడిన ఢిల్లీ.. కెప్టెన్ ఆయుశ్ బదోని (53), సనత్ సంగ్వాన్, ఆయుశ్ దోసేజాల మెరుపులతో భారీ స్కోరు చేసింది.
151 ఓవర్లలో 4 వికెట్లకు 529 పరుగుల వద్ద ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లరేషన్ ప్రకటించింది. హైదరాబాద్ పేసర్ సివి మిలింద్ (3/57) మూడు వికెట్లు పడగొట్టగా.. పున్నయ్య (1/51) ఓ వికెట్ తీసుకున్నాడు. ఆయుశ్ దోసేజా ఫస్ట్‌క్లాస్ అరంగేట్రంలోనే ద్వి శతకం బాదటం విశేషం. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 77/1తో ఆడుతోంది. రాహుల్ సింగ్ (35) అవుటైనా.. తన్మయ్ అగర్వాల్ (27 నాటౌట్), అనికెత్ రెడ్డి (11 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగుల వెనుకంజలో నిలిచింది.