ఆయుష్ ఆర్గనైజేషన్ కోట శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు: కాలేశ్వర-ముక్తేశ్వర స్వామి త్రివేణి సంఘంలో జరిగిన సరస్వతి పుస్కరాలలో 2025 నేపథ్యంలో వరంగల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్ సంబంధిత డిపార్ట్మెంట్ల నుండి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు గత పది రోజులుగా డాక్టర్ ప్రమీలదేవి ఆర్డిడి వరంగల్, డాక్టర్ తనుజారాణి నోడల్ ఆఫీసర్ భూపాల్ పల్లి ఆధ్వర్యంలో సేవలు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇప్పటికే కార్యక్రమాన్ని సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పది రోజులు 4967 మందికి వైద్యం చేసినట్లుగా ఆర్గనైజేషన్ కోట శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సద్వినియోగం చేసుకోవాలని సందర్శకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్ర డిపిఎం, జయశంకర్ భూపాలపల్లి, డాక్టర్ భాను కుమార్ డిపిఎం హనుమకొండ, యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్యులు , ఫార్మసిస్ట్లు, యోగా ఇన్స్పెక్టర్లు, ఎస్ ఎన్ఓఎస్ లు, పిటిఎస్ పాల్గొన్నారు.
పుష్కరాల్లో 4967 మందికి ఆయుష్ సేవలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES