- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 28 ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీబిపేట లో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా అయ్యప్ప స్వామివారి ఊరేగింపులో పాల్గొనే అయ్యప్ప స్వాములకు, వారి మాత స్వాములకు ఏకరూప దోతి, పంచ, మాత స్వాములకు ఏకరూప చీరలను బీబీపేట గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకులు అరికెల మంజుల నందకుమార్ అందజేశారు. ఈనెల 28 తేదీ సాయంత్రం జరగబోయే అయ్యప్ప స్వామి ఊరేగింపులో భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తదుపరి దేవస్థానం వద్ద అల్పాహారం చేయగలరని అయ్యప్ప సేవా సంఘం బీబీపేట వారు పేర్కొన్నారు.
- Advertisement -


