Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమ్మాయిల ఉన్నత చదువులకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ చేయూత

అమ్మాయిల ఉన్నత చదువులకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ చేయూత

- Advertisement -

15 వేల మందికి రూ.30 వేల స్కాలర్‌షిప్‌
నెలాఖరు వరకు దరఖాస్తుకు అవకాశం : బాలకిష్టారెడ్డి, శ్రీనివాసరావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమ్మాయిల ఉన్నత చదువులకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ చేయూత నందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్‌ చదివిన 15 వేల మందికి ఏటా అమ్మాయిలకు రూ.30 వేల స్కాలర్‌షిప్‌ అందించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన బాలికలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తెలంగాణ హెడ్‌ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ గతేడాది మూడు రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్కాలర్‌షిప్‌ల ను అందజేశామని వివరించారు. ఈ ఏడాది నుంచి 18 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 15 వేల మంది అమ్మాయిలకు స్కాలర్‌ షిప్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈనెల పదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందనీ, ఇప్పటి వరకు 3,276 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈనెల 30 వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశముందని, వీటిని ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. లాటరీ ద్వారా అమ్మాయిలను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -