నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 31న టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావుకు ఇస్తూ అక్టోబర్ పదో తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విస్తృత అభిప్రాయ సేకరణలో భాగంగా మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బి శ్యామ్‌ను ఎన్నుకున్నారు. వచ్చేనెల ఒకటో తేదీన ఆయన టీజీవో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరిస్తారు. శ్యామ్ ప్రస్తుతం టీజీవో అసోసియేట్ అధ్యక్షులుగా, రాష్ట్ర పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. టీజీవో ప్రధాన కార్యదర్శిగా బి శ్యామ్‌ను ఎన్నుకోవడం పట్ల ఉద్యోగులు, అధికారులు హర్షం ప్రకటించారు.
టీజీవో ప్రధాన కార్యదర్శిగా బి శ్యామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



