రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన స్నేహితుల్లో ఒక యువకుడు నీటిలో మునిగి గల్లంతైన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరుబండకు చెందిన అక్షితరెడ్డి (23), రోహిత్, పవన్, అనిల్ అనే నలుగురు స్నేహితులు గూగుల్ మ్యాప్ చూస్తూ సరదాగా రాజేంద్రనగర్‌లోని మూసీ వాగు వద్దకు వచ్చారు. అనంతరం ఆ నలుగురు స్నేహితులు మూసీలో ఈత కొట్టడానికి దిగారు. అందులో అక్షిత్ రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు అతని చేయి పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే మిగతా స్నేహితులు.. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్షిత్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నీటిలో మునిగి బీటెక్ విద్యార్థి గల్లంతు
- Advertisement -
- Advertisement -