Thursday, October 2, 2025
E-PAPER
Homeసినిమాన్యూ ఏజ్‌ క్రైమ్‌ కామెడీతో 'బా బా బ్లాక్‌ షీప్‌'

న్యూ ఏజ్‌ క్రైమ్‌ కామెడీతో ‘బా బా బ్లాక్‌ షీప్‌’

- Advertisement -

గన్స్‌, గోల్డ్‌ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్‌ క్రైమ్‌ కామెడీగా ‘బా బా బ్లాక్‌ షీప్‌’ అనే చిత్రం రాబోతోంది.
దోణెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకుడు. టిను ఆనంద్‌, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్‌, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మేకర్స్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్‌ షీప్‌’ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయించారు.

ఈ మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే.. గన్స్‌, గోల్డ్‌ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్‌ క్రైమ్‌ కామెడీ అని అర్థం అవుతోంది. ఓ ముగ్గురు చుట్టూ తిరిగే కథ అంతా కూడా ఒకే రోజులో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్‌ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.
ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -