Saturday, December 20, 2025
E-PAPER
Homeజాతీయంలైవ్ డిబేట్‌లో కుస్తీకి దిగిన‌ బాబా రామ్‌దేవ్‌.. వీడియో వైర‌ల్

లైవ్ డిబేట్‌లో కుస్తీకి దిగిన‌ బాబా రామ్‌దేవ్‌.. వీడియో వైర‌ల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యోగా గురువు బాబా రామ్‌దేవ్ కుస్తీ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఒక జాతీయ టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో ఒక ప్యానెలిస్ట్‌తో కుస్తీకి దిగారు రామ్‌దేవ్ బాబా. అమర్ ఉజాలా టీవీ ఛానల్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చ మధ్యలో తన బలాన్ని ప్రదర్శించేందుకు రామ్‌దేవ్ బాబా.. తన ఎదురుగా ఉన్న ప్యానెలిస్ట్‌పై ఓ కుస్తీ ఎత్తుగడ ప్రయోగించబోయారు. అయితే, ఆ ప్యానెలిస్ట్ అంతే వేగంగా స్పందించి, రామ్‌దేవ్‌ను నిలువ‌రించేందుకు య‌త్నించారు. దాంతో ప్యానెలిస్ట్‌ను కిందపడేయడంలో రామ్‌దేవ్ బాబా విఫలమ‌య్యారు.

అయితే, జరిగిన దానిపై రామ్‌దేవ్ బాబా స్పందిస్తూ అదంతా కేవలం సరదా కోసం చేసిందేనని, సీరియస్‌గా తీసుకోవద్దని వివరణ ఇచ్చారు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. రామ్‌దేవ్ వేసిన ఎత్తుగడ ఆయనకే రివర్స్ అయిందంటూ సెటైర్లు వేస్తున్నారు. “పతంజలి నెయ్యి తింటే ఇలాగే జరుగుతుంది” అని కొందరు, “స్కామ్‌దేవ్” అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -