- Advertisement -
ఆసియాకప్‌కు పాకిస్తాన్ జట్టు ఎంపిక
లాహౌర్: ప్రతిష్టాత్మక ఆసియాకప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో కూడిన జట్టును ఆదివారం ప్రకటించగా.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఆసియాకప్‌తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్‌తో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ కోసం టీమ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన మాజీ కెప్టెన్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. సల్మాన్ అగా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. షాహిన్ షా అఫ్రిదీ, మహమ్మద్ వసీం, సల్మాన్ మీర్జా జట్టులో చోటు నిలుపుకున్నారు.
- Advertisement -