Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కాంగ్రెస్ భవన్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ..అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు. విద్య, న్యాయం మరియు సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడారు.అంబేడ్కర్ గారు ప్రజలకు స్వేచ,స్వాతంత్రపు హక్కులు కల్పించారు. కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుంది.ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలరస్తుంది. అంబేడ్కర్ ని పేరును కనుమరుగు చేసే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది.

కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కారక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగాన్ని,రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి,నూడ చైర్మన్ కేశ వేణు,డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ ముప్ప గంగారెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,సీనియర్ నాయకులు భక్తవత్సలం,సీనియర్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్,SC సెల్ అధ్యక్షులు లింగం, ఏఐసిసి అసెంబ్లీ కో ఆర్డినేటర్ కాపుకర్ గన్ రాజ్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష,చంద్రకళ, విజయ రాణి,దత్తాద్రి,బంటు బలరాం,రాజేంద్ర ప్రసాద్, ఆమ రాజు, అయ్యుబ్,భాజన్న,మహేందర్,ఎండల కిషన్,నరేందర్ గౌడ్,కరాటే రమేష్,అఫ్సర్, చికోటీ దిలీప్,శిలమంతుల రాజు తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -