నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి జిపి గ్రామంలో ఆదివారం మాజీ ఉప ప్రధానమంత్రి 119వ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రావ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రావు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు , సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడని తెలిపారు.
అనగారిన వర్గాలకు చేసిన ఆయన సేవలు ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని పేర్కొన్నారు. సమతా దివస్ అనేది సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం జరుపుకునే ముఖ్యమైన రోజు అని అన్నారు. ఆయన సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని పోరాడారు అని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, సమానత్వం పాటించాలని సంకల్పించారని అన్నారు. సమానత్వమే సమాజ అభివృద్ధికి మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ తో పాటు, మాజీ సర్పంచ్ వినోద్ ఆస్పత్వార్ , మాజీ ఉప సర్పంచ్ ఖండే రావు ,మాజీ ఎంపీటీసీ నాగేష్, గ్రామ పెద్దలు బస్వాపూరే శంకర్ , సాయిలు, సంతోష్, యూత్ సభ్యులు సతీష్ సర్, రాజశేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
– పలు జిపి గ్రామాలలో: అదేవిధంగా జుక్కల్ మండలం కేంద్రంలోని గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ఆధ్వర్యంలో, కంఠాలి జిపి గ్రామంలో సర్పంచ్ నాగనాథ్ ఆధ్వర్యంలో, డోన్ గాడ్ జి పి సర్పంచ్ శ్రీనివాస ఆధ్వర్యంలో, గుల్లతాండ జీపీ సర్పంచ్ సుమతి, నాగర్ గావ్ సర్పంచ్ సునంద విజయ్, బిజ్జల్ వాడి సర్పంచ్ గంగాబాయి, మాదాపూర్ సర్పంచ్ ఆశా పాటిల్, వజ్రఖండి సర్పంచ్ సింత్రాళే సావిత్రి, మహమ్మదాబాద్ జిపి సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు, ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను గ్రామాలలో జరిపించారని తెలిపారు.



