Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కుల వివక్షత్రపై చేసిన పోరాటం మరువలేనిదని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన చిన్నతనం నుండే కుల వివక్షత పై ఎన్నో పోరాటాలు చేశారని దళితుల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండగాని రాములు, గోపగాని రమేష్ గౌడ్, రవికుమార్, రమేష్, బొజ్జ సాయికిరణ్, మల్లేష్, వెంకటేష్, బొంకూరి మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -