Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాబు జాగ్జీవన్ జయంతి వేడుకలు 

ఘనంగా బాబు జాగ్జీవన్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయం.

కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ పాలకులకు ఆదర్శప్రాయం. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఆ స్ఫూర్తితోనే మన ప్రభుత్వం ప్రజా రంజక పాలనను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత నర్సయ్య, కౌన్సిలర్ సందీప్, నీలం రవి, సంగ్యా నాయక్,    అనంతరావు, ప్రజా ప్రతినిధులు, దళిత బహుజన నాయకులు చెప్పాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -